Boston Consulting Group: 84 శాతం మంది భారత స్మార్ట్‌ఫోన్ యూజర్లు నిద్రలేవగానే చేసేదిదే!

  • భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అలవాట్లపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక
  • గత దశాబ్ద కాలంలో స్మార్ట్‌ఫోన్లతో ప్రజల్లో గణనీయ మార్పులు
  • 84 శాతం మంది యూజర్లు ఉదయం నిద్రలేచిన 15 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ చెక్ చేస్తున్నట్టు వెల్లడి
  • వీడియోలు చూసేందుకే స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్న వైనం
84 percent of Indian smartphone users check mobile within 15 mins of waking up

మన జీవితాలతో స్మార్ట్‌ఫోన్ ఎంతగా పెనవేసుకుపోయిందో కళ్లకుకట్టినట్టు చెప్పే సర్వే ఒకటి తాజాగా విడుదలైంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ యూజర్ల అలవాట్లపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ‘రీఇమాజినింగ్ స్మార్ట్ ఫోన్ ఎక్స్‌పీరియన్స్: హౌ సర్ఫేసెస్ ప్లే కీ రోల్ ఇన్ మేకింగ్ ఫోన్స్ స్మార్టర్’ పేరిట ఈ నివేదిక విడుదలైంది. 2010లో స్మార్ట్‌ఫోన్ల యుగం ప్రారంభమైన తొలి రోజులను, ప్రస్తుత పరిస్థితులను పోలుస్తూ ఈ నివేదిక రూపొందించారు.   
సర్వేలో ముఖ్యాంశాలు

  • స్మార్ట్‌ఫోన్ యూజర్లలో 84 శాతం మంది నిద్రలేచిన తొలి 15 నిమిషాల్లో తమ ఫోన్ చెక్ చేసుకుంటున్నారు.
  • మెలకువగా ఉన్నప్పుడు దాదాపు 31 శాతం సమయం ఫోన్ చూస్తూ గడిపేస్తున్నారు. 
  • రోజుకు సగటున 80 సార్లు నోటిఫికేషన్లు, ఇతర మెసేజీల కోసం ఫోన్లు చెక్ చేస్తుంటారు.
  • దాదాపు 50 శాతం మంది స్మార్ట్‌ఫోన్లలో వీడియో కంటెంట్ చూస్తుంటారు. 
  • 2010లో ఫోన్లపై సగటున 2 గంటలు వెచ్చిస్తుండగా ఇప్పుడా సమయం 4.9 గంటలకు పెరిగింది.
  • 2010లో జనాలు ఫోన్లతో మెసేజీలు, కాల్స్ చేసేందుకే పరిమితమైతే ప్రస్తుత రోజుల్లో పావు శాతం సమయమే వీటికి కేటాయిస్తున్నారు. 
  • స్మార్ట్‌ఫోన్లను ఇతరులతో టచ్‌లో ఉండే బదులు సెర్చింగ్, గేమింగ్, షాపింగ్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
  • 18-24 ఏళ్ల మధ్య వయసున్న వారిలో అధికశాతం షార్ట్ వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారు. 35 ఏళ్లకు పైబడ్డ వారిలో ఈ ట్రెండ్ తక్కువగా ఉంది. 
  • సుమారు 66 శాతం సందర్భాల్లో జనాలు అవసరం కంటే అలవాటుగా సెల్‌ఫోన్‌ను చేతుల్లోకి తీసుకుంటున్నారు. 
  • జనాభాలో అధిక శాతం మంది తొలిసారిగా ఇంటర్నెట్ సేవలను స్మార్ట్‌ఫోన్ ద్వారానే పొందారు. తక్కువ ధరకు డాటా, డెస్క్ టాప్‌లు ఖరీదైన వ్యవహారంగా మారడంతో సెల్‌ఫోన్‌పై ఆధారపడుతున్నారు.

More Telugu News